Old Woman: కరోనాతో విజయనగరం జిల్లా వృద్ధురాలి మృతి

Old age woman from Vijayanagaram distrcit died with corona
  • విజయనగరం జిల్లాలో నాలుగు కేసులు
  • మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వృద్ధురాలు
  • విశాఖలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • కుటుంబ సభ్యులకు నెగెటివ్
కరోనా వ్యాప్తి మొదలయ్యాక చాలా రోజుల పాటు కేసుల్లేకుండా ఉన్న విజయనగరం జిల్లాలో ఇటీవలే నాలుగు పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వారిలో ఒక వృద్ధురాలు మరణించింది. ఆమె వయసు 60 ఏళ్లు. విజయనగరం జిల్లాలో కరోనాతో ఇదే తొలి మరణం.

బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన ఆమె కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. విశాఖలో డయాలసిస్ కోసం వచ్చిన సమయంలోనే కరోనా సోకినట్టు భావిస్తున్నారు. విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే, ఆమె కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేయగా నెగెటివ్ వచ్చిందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.
Old Woman
Vijayanagaram District
Corona Virus
Death
Visakhapatnam

More Telugu News