Akkineni Amala: మదర్స్ డే సందర్భంగా తల్లితో పాటు అత్తగారి ఫొటో కూడా పోస్టు చేసిన అమల
- ఇవాళ అంతర్జాతీయ మాతృ దినోత్సవం
- ట్విట్టర్ లో అమల స్పందన
- తన జీవితంలో ముఖ్యమైన స్త్రీమూర్తుల ఫొటోలు పంచుకున్న వైనం
ఇవాళ అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అమ్మపై పోస్టులే దర్శనమిస్తున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీ అక్కినేని అమల కూడా మదర్స్ డే సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు.
ఈ సందర్భంగా తన జీవితంలోని కొందరు స్త్రీమూర్తులను తల్లుల కంటే మిన్న అని పేర్కొంటూ విషెస్ తెలిపారు. అంతేకాకుండా వారి ఫొటోలను కూడా పోస్టు చేశారు. తన తల్లి ఫొటో మాత్రమే కాకుండా అత్తగారైన అక్కినేని అన్నపూర్ణ ఛాయాచిత్రాన్ని కూడా అమల పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానిస్తూ, "ఆ ఫొటోలో ఉన్నది మా అత్తగారు అన్నపూర్ణ. తల్లి కంటే ఎక్కువ. ఐ మిస్ యూ అత్తమ్మా" అంటూ పేర్కొన్నారు. అమల పోస్టు చేసిన ఫొటోల్లో ఆమె సోదరి, మేనకోడలు కూడా ఉన్నారు. తల్లి గురించి చెబుతూ "మై బ్యూటిఫుల్ మామ్" అంటూ ట్వీట్ చేశారు.