Prakash Raj: వలస కార్మికుల పరిస్థితి పట్ల ప్రకాశ్ రాజ్ సానుభూతి
- లాక్ డౌన్ తో వలస కార్మికులకు కష్టాలు
- ఫార్మ్ హౌస్ నుంచి ఆహారం పంపిస్తున్న ప్రకాశ్ రాజ్
- నిత్యం 500 మందికి భోజనం
భారత్ లో కరోనా మహమ్మారి విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు ప్రకటించిన లాక్ డౌన్ వలస కార్మికుల పట్ల పెను విఘాతంలా పరిణమించింది. దేశవ్యాప్తంగా లక్షల మంది వలస కార్మికులు, కూలీలు ఎక్కడిక్కడ చిక్కుకుపోయారు. వారిలో చాలామంది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వస్థలాలకు పయనమవుతున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని పట్ల ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చలించిపోయారు. వారికి తన ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తున్నట్టు వెల్లడించారు.
"వలస కార్మికులు నా తోటి దేశ పౌరులు. ఇప్పుడు వాళ్లు రోడ్డు మీద ఉన్నారు. అందుకే వారిని ఆదుకునేందుకు నా ఫౌండేషన్ ద్వారా నిత్యం 500 మందికి భోజనం అందిస్తున్నాం. నా ఫార్మ్ హౌస్ లోనే వండి, ప్యాక్ చేసి పంపిస్తున్నాం. వలస కార్మికుల కష్టాలను తొలగిద్దాం, వారిని ఆదుకునే మార్గాలు చూడండి. మానవత్వాన్ని చాటుకోండి" అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.