Vijay Sai Reddy: ఫేక్ అకౌంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

YSRCP leader Vijayasai Reddy complains to cyber crime police
  • ఏపీ సైబర్ పోలీసులను ఆశ్రయించిన వైసీపీ ఎంపీ
  • తన పేరిట ఫేక్ అకౌంట్లు రూపొందించారని వెల్లడి
  • అసభ్య పదజాలంతో పోస్టులు చేస్తున్నారని ఆవేదన
తన గౌరవ మర్యాదలకు, వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి అసభ్య పదజాలంతో పోస్టులు చేస్తున్నారని ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ, సైబర్ క్రైమ్ చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. ఫేక్ న్యూస్ పోస్టు చేసేవాళ్లు మాత్రమే కాకుండా, ఇలాంటి అసత్య వార్తలను షేర్ చేసేవాళ్లు సైతం శిక్షార్హులేనని స్పష్టం చేశారు.
Vijay Sai Reddy
Cyber Crime Police
Andhra Pradesh
Fake Accounts
Social Media

More Telugu News