Devineni Uma: ఏపీలో విద్యుత్ స్లాబుల రేట్లు రెట్టింపు చేసి బాదుడు మొదలుపెట్టారు: దేవినేని ఉమ విమర్శలు
- సంపద సృష్టి చేతగాని ప్రభుత్వం
- నాడు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు?
- ఇప్పుడు.. బాదుడు మొదలుపెట్టారు!
ఏపీలో విద్యుత్ స్లాబ్ ల రేట్ల పెంపుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, టీడీపీ నేత దేవినేని ఉమ స్పందించారు. ‘సంపద సృష్టి చేతగాని మీ ప్రభుత్వం..’ అంటూ విరుచుకుపడ్డారు. నాడు ఎన్నికల ప్రచారంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు, అధికారంలోకి వచ్చాక స్లాబుల రేట్లు పెంచేశారని మండిపడ్డారు.
‘నేడు కరోనా, లాక్ డౌన్ సమయంలో స్లాబుల రేట్లు రెట్టింపు చేసి బాదుడు మొదలుపెట్టారు’ అని ఆయన విమర్శించారు. ‘ఈ అన్యాయపు వసూళ్ళని తక్షణం ఆపాలని ప్రజలు అడుగుతున్నారని, ముఖ్యమంత్రి జగన్ దీనికి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కాగా, గతంలో జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఓ వీడియోను దేవినేని ఉమ పోస్ట్ చేశారు.