Wuhan: వుహాన్ లో మళ్లీ మొదలైంది... ఒకే కాంప్లెక్స్ లో ఐదుగురికి కరోనా

Wuhan gets new set of corona cases
  • కరోనా జన్మస్థానంగా వుహాన్ సిటీకి గుర్తింపు
  • ఇటీవలే లాక్ డౌన్ ఎత్తివేత
  • లక్షణాలు లేకుండానే వైరస్ సోకుతున్న వైనం
చైనాలోని వుహాన్ నగరం అంటే కరోనా జన్మస్థానం అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. అంతలా గుర్తింపు తెచ్చుకున్న ఆ నగరంలో కరోనా కలకలం మళ్లీ మొదలైంది. ఒకే కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ అని తేలింది.

ఇటీవలే వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేశారు. ఆఫీసులు, కొన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, మ్యూజియంలు, ఇతర వినోద ప్రధాన కేంద్రాలు కూడా తెరుచుకున్నాయి. వ్యాపారాలన్నీ షురూ అయ్యాయి. కరోనా సద్దుమణిగిందనుకున్న తరుణంలో మళ్లీ పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

తాజాగా కరోనా బారినపడినవారిలో ఓ వృద్ధురాలు కూడా ఉంది. ఆమె భర్తకు ఇటీవలే కరోనా పాజిటివ్ అని తేలింది.  తాజాగా కరోనా నిర్ధారణ అయిన ఐదుగురిలోనూ ఎలాంటి లక్షణాలు లేకపోవడం కూడా అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
Wuhan
Corona Virus
COVID-19
China

More Telugu News