Telangana: ఏపీ ఇచ్చిన జీవో నెం.203పై తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆగ్రహం

Telangana retired engineers fires on GO issued by AP Governmenr

  • ప్రతిరోజూ 10 టీఎంసీల తరలింపుకు యత్నం అంటూ ఆరోపణలు
  • కృష్ణా నది మొత్తాన్ని మళ్లించే కుట్ర అంటూ వ్యాఖ్యలు
  • జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడి

తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఏపీ సర్కారు ఇచ్చిన జీవో నెం.203పై అభ్యంతరం వ్యక్తం చేసింది. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 10 టీఎంసీల కృష్ణా జలాలను తరలించేందుకు ఏపీ ఈ జీవో ఇచ్చిందని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈ జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తూ తీసుకువచ్చిన ఈ జీవోపై ప్రభుత్వం సమీక్షించాలని కోరారు. పోతిరెడ్డిపాడు ద్వారా 7 టీఎంసీలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 3 టీఎంసీలు ప్రతిరోజూ తరలించేందుకు ఏపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఆయా ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొద్దిరోజుల క్రితమే ఏపీ సర్కారు జీవో జారీ చేసిందని, ఇది మొత్తం కృష్ణానదిని మళ్లించే కుట్రపూరిత పథకం అని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News