Anand Mahindra: లాక్ డౌన్ ను ఇంకా పొడిగిస్తే ఆత్మహత్యా సదృశమే: ఆనంద్ మహీంద్రా
- బలహీన వర్గాలు దెబ్బతింటాయని వ్యాఖ్యలు
- పేదలపై దుష్ప్రభావం చూపుతుందని వెల్లడి
- ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సి ఉందని సూచన
లాక్ డౌన్ విధించడం వల్లే దేశంలో లక్షల మంది ప్రాణాలు నిలిచాయని, కానీ లాక్ డౌన్ ను ఇంకా పొడిగిస్తే బలహీన వర్గాలు దారుణంగా దెబ్బతింటాయని, ఆర్థిక వ్యవస్థ పాలిట ఆత్మహత్యా సదృశం అవుతుందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. భారత్ లో కరోనా మరణాల రేటు 10 లక్షల మందికి 1.4 మాత్రమేనని, ఇదే సమయంలో మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను లాక్ డౌన్ పొడిగింపు బలహీన పరుస్తుందని, ఆ ప్రభావం పేదలపై దుష్పరిణామాలకు కారణమవుతుందని ఆనంద్ మహీంద్రా విశ్లేషించారు.