Sania Mirza: ఫెడ్‌కప్ అవార్డు గెలుచుకుని రికార్డు సృష్టించిన సానియా మీర్జా

Sania wins fed cup Hear Award

  • ఆసియా-ఓసియానియా జోన్ నుంచి విజేతగా నిలిచిన సానియా
  • ఆన్‌లైన్ పోలింగులో 60 శాతానికిపైగా ఓట్లు
  • అవార్డును గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్న టెన్నిస్ స్టార్

ప్రతిష్ఠాత్మక ఫెడ్‌కప్ హార్ట్ అవార్డును కొల్లగొట్టిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రికార్డులకెక్కింది. ఈ అవార్డు గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఆసియా-ఓసియానియా జోన్ నుంచి ఫెడ్‌కప్ హార్ట్ అవార్డుకు నామినేట్ కావడంతోనే రికార్డులకెక్కిన సానియా.. ఈ నెల ఒకటో తేదీ నుంచి వారం రోజులపాటు నిర్వహించిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో విజేతగా నిలిచింది. మొత్తం 16,985 మంది ఓటింగ్‌లో పాల్గొనగా, 10 వేలకు పైగా ఓట్లు అంటే 60 శాతానికి పైగా సానియాకే పోలయ్యాయి.

విజేతగా నిలిచిన సానియాకు 2000 అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.1.50 లక్షలు) నగదు బహుమతి లభించింది. ఫెడ్ కప్ హార్ట్ అవార్డు గెలుచుకోవడంపై సానియా మాట్లాడుతూ.. ఈ అవార్డు దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొంది. అవార్డు ద్వారా లభించిన నగదు మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు సానియా మీర్జా తెలిపింది.

  • Loading...

More Telugu News