Train Accident: నిబంధనలను మార్చిన రైల్వే శాఖ... కొన్ని వర్గాలకు రాయితీ ప్రయాణం!

Consession Tickets for Some Sectors in Trains

  • తొలుత రాయితీ టికెట్లు ఉండబోవని ప్రకటన
  • విద్యార్థులకు, దివ్యాంగులకు, రోగులకు మినహాయింపు
  • అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచన

లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రైలు సర్వీసులు, నేటి నుంచి పరిమిత సంఖ్యలో పునరుద్ధరించబడగా, తొలుత ఎవరికీ రాయితీలతో కూడిన ప్రయాణం ఉండదని పేర్కొన్న రైల్వే శాఖ, కొన్ని సడలింపులను ప్రకటించింది. విద్యార్థులు, దివ్యాంగులు, రోగులకు ఊరటను ఇస్తూ, వారికి రాయితీతో కూడిన ప్రయాణాలకు అనుమతి ఇచ్చింది. కొంతమందికి మాత్రమే రాయితీ టికెట్లు జారీ చేస్తామని, ఇతర కేటగిరీ రాయితీలు ఉండబోవని తేల్చింది.

విద్యార్థులతో పాటు నాలుగు వర్గాల దివ్యాంగులు, 11 రకాల రోగులకు ఈ ధరలు వర్తిస్తాయని, ఎంతో అత్యవసరమైతేనే వారు ప్రయాణాలు చేయాలని సూచించింది. కాగా, న్యూఢిల్లీ నుంచి వివిధ నగరాలకు నేటి నుంచి రైలు సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రయాణికులు విధిగా నిబంధనలను పాటించాలని ఆదేశించింది. రైలులో ముందుగా బుక్ చేసుకుంటేనే ఆహారం, నీటిని అందిస్తామని తేల్చి చెప్పింది. బెడ్ షీట్లు, దిండ్ల సరఫరా ఉండబోదని, కర్టెన్లను అన్నింటినీ తొలగిస్తామని పేర్కొంది.

కనీసం గంటన్నర ముందుగానే ప్రయాణికులు స్టేషన్ కు చేరుకోవాలని, మాస్క్ ధరించడం తప్పనిసరని వెల్లడించింది. తదుపరి ప్రకటన వచ్చేంత వరకూ రెగ్యులర్ రైళ్లు, మెయిల్ / ఎక్స్ ప్రెస్ సబర్బన్ సర్వీసులు నడవబోవని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News