Shiv Sena: ‘మహా’ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు కారు కూడా లేదట!

Uddhav Thackeray says he did not have car

  • ఈ నెల 21న మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు
  • తనకు, తన కుటుంబానికి కలిపి రూ.143.26 కోట్లు ఆస్తులు ఉన్నాయని ప్రకటన
  • తనకు రూ.15.50 కోట్ల అప్పులు ఉన్నాయన్న శివసేన అధినేత

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సొంత కారు కూడా లేదట. ఈ విషయాన్ని ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 21న ఎన్నికలు జరగనున్నాయి. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న శివసేన అధినేత తన ఆస్తులను ప్రకటించారు.

తనకు, తన కుటుంబానికి కలిపి రూ.143.26 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో సీఎం పేర్కొన్నారు. తనకు సొంత కారు కూడా లేదని అందులో పేర్కొనడం గమనార్హం. తనకు రూ.4.06 కోట్ల రుణంతోపాటు రూ.15.50 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, రూ. 81.37 కోట్ల స్థిరాస్తులు, రూ.61.89 కోట్ల చరాస్తులు ఉన్నాయని పేర్కొన్న ఉద్ధవ్.. తమకు రూ.76.59 కోట్ల వ్యక్తిగత ఆస్తులు ఉన్నట్టు తెలిపారు.

శివసేన పార్టీ పత్రిక సామ్నా ఎడిటర్ అయిన తన భార్య రష్మీ థాకరేకు పలు వ్యాపారాలు ఉన్నాయని, వడ్డీలు, అద్దెలు, కంపెనీ షేర్ల లాభాలు, డివిడెండ్ల ద్వారా ఆమెకు ఆదాయం వస్తుందని తెలిపారు. అలాగే, ఆమెకు  రూ.11.44 కోట్ల రుణాలు ఉన్నట్టు అఫిడవిట్‌లో వివరించారు.

  • Loading...

More Telugu News