Pawan Kalyan: కరుణతో రోగులను సంరక్షిస్తున్న నర్సులందరికీ శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes Nurses

  • ఆసుపత్రిలో వారిని ‘సిస్టర్’ అని పిలుస్తారు
  • తమ కుటుంబ సభ్యులకు చేసే సేవగా నర్సులు భావిస్తారు
  • ‘కరోనా’ సమయంలో నర్సులు సాహసంతో విధులు నిర్వర్తిస్తున్నారు 

ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్  శుభాకాంక్షలు తెలిపారు. కరుణతో రోగులను సంరక్షిస్తున్న.. గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ప్రతి నర్సుకి తన తరఫున, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. వృత్తి రీత్యా ‘నర్సు’ అయినా ఆసుపత్రిలో వారిని ‘సిస్టర్’ అని సంబోధిస్తారని, ఆ పిలుపుతోనే తమ కుటుంబ సభ్యులకు చేసే సేవగా నర్సులు భావించి సపర్యలు చేస్తారని కొనియాడారు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో ఆసుపత్రుల్లో, ఐసోలేషన్ వార్డుల్లో నర్సులు సాహసంతో తమ విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ వారసత్వాన్ని ఈ ‘కరోనా సమయంలో నర్సులు కొనసాగిస్తున్న తీరు సర్వదా ప్రశంసనీయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో నర్సింగ్ విభాగం చాలా అవసరం అని అన్నారు. సమర్థమైన నర్సులు మరింత మంది రావాలనే విషయాన్ని వైద్య నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ, గౌరవప్రదమైన వేతనాలు అందించేలా ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు.

  • Loading...

More Telugu News