Krishna water: తెలంగాణతో నీటి గొడవపై ఏపీ మంత్రి అనిల్ స్పందన

Minister Anil response on water issue with Telangana

  • రెండు రాష్ట్రాల మధ్య వివాదం సృష్టించేందుకు కొన్ని పార్టీలు యత్నిస్తున్నాయి
  • సముద్రంలోకి వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాం
  • కృష్ణా బోర్డు పరిధిలోనే నీటి వినియోగం

కృష్ణానది నీటిని పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 3 టీఎంసీల వంతున తరలించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ అంశంపై స్పందించారు.

ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం సృష్టించేందుకు కొన్ని పార్టీలు యత్నిస్తున్నాయని అనిల్ ఆరోపించారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో... పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీటి పరిమాణాన్ని పెంచాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కృష్ణా నీటి కేటాయింపులను బోర్డు నిర్ణయిస్తుందని... బోర్డు నిర్ణయించిన పరిధిలోనే ఇరు రాష్ట్రాలు నీటిని వాడుకుంటాయని చెప్పారు.

  • Loading...

More Telugu News