Corona Virus: ‘కరోనా’ రోగులకు చికిత్స అందించే వైద్యులు మరింత సురక్షితంగా ఉండేందుకు ‘డాఫింగ్ యూనిట్స్’

 Daffing Units for doctors

  • పీపీఈలు ధరించే విధానం ‘డోనింగ్’
  • వీటిని తొలగించే పద్ధతి ‘డాఫింగ్’
  •  డాఫింగ్ యూనిట్స్ లో వీటిని తొలగించడం ద్వారా సురక్షితంగా ఉండొచ్చు

కరోనా వైరస్ సోకిన బాధితులకు వైద్య సేవలందించే సిబ్బంది సురక్షితంగా ఉండేందుకు వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈ) ధరించే విధానాన్ని ‘డోనింగ్’ అని, వీటిని తొలగించే పద్ధతిని ‘డాఫింగ్’ అని పిలుస్తారు. ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ ల వ్యాప్తి నిరోధానికి ఇటువంటి పద్ధతులను అనుసరించడం తప్పనిసరి.

అయితే, పీపీఈలను ధరించే సమయంలో ఎన్ని జాగ్రత్తలు పాటించాలో వాటిని తొలగించేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చెంగల్ పట్టు ప్రభుత్వ ఆసుపత్రి (సీజీఎంసీ)తో కలిసి ఐఐటీ మద్రాసు డాఫింగ్ యూనిట్లను అందుబాటులోకి తెచ్చింది. ఐఐటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కోషి వర్గీస్, ఫ్రొఫసర్ అరుల్ జయచంద్రన్, సీజీఎంసీ ఇన్నోవేషన్ బృందంతో కలిసి డాపింగ్ యూనిట్ ను రూపొందించారు.  
 
కాగా, లాక్డౌన్ విధించిన తర్వాత ఏప్రిల్ నెలలో డాఫింగ్ యూనిట్ కు రూపకల్పన చేశారు. వివిధ నమూనాలను రూపొందించి పరిశీలించిన అనంతరం దీనిని ఖరారు చేశారు. పీపీఈలను తొలగించే సమయంలో డాఫింగ్ యూనిట్లను వినియోగించడం ద్వారా ‘కరోనా’ను మనతో తీసుకెళ్తామనే భయం ఇకపై ఉండదని వైద్యులు అంటున్నారు.

  • Loading...

More Telugu News