Russia: భారీగా కేసులు నమోదవుతున్నా.. ఆంక్షలు ఎత్తేస్తున్న రష్యా!
- రష్యాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,32,243
- ఇప్పటి వరకు 2,116 మంది మృతి
- టెస్టులు పెరగడం వల్లే కేసులు పెరిగాయంటున్న రష్యా
రష్యాపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా తర్వాత అత్యధికంగా ప్రభావితమైన దేశం రష్యానే. ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 2,32,243కి చేరుకున్నాయి. కరోనా బారిన పడిన వారిలో ఆ దేశ ప్రధానమంత్రి, ఇద్దరు మంత్రులు, అధ్యక్షుడు పుతిన్ మీడియా కార్యదర్శి కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 2,116 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే దేశ జనాభాతో పోలిస్తే కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని రష్యా భావిస్తోంది. టెస్టుల సంఖ్య పెరగడం వల్లే కేసుల సంఖ్య పెరిగిందని చెబుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలను సడలించేందుకు సిద్ధమైంది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో వ్యాపార కూడళ్లు, పార్కులు తెరుచుకుంటున్నాయి. గత వారంలో రష్యాలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.