APSRTC: మరో 5 రోజుల్లో రోడ్డెక్కనున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులు

APSRTC to start buses from May 18

  • 18 నుంచి బస్సులు తిప్పేందుకు సిద్ధమవుతున్న ఆర్టీసీ
  • రీజనల్ మేనేజర్లకు సర్క్యులర్ జారీ
  • ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు

ఏపీలో ఇక ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. తాజాగా ప్రజారవాణాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో... ఆర్టీసీ బస్సులు తిప్పాలని అధికారులు నిర్ణయించారు. 18వ తేదీకల్లా బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రంలోని రీజనల్ మేనేజర్లకు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ సర్క్యులర్ జారీ చేశారు.

ఆర్టీసీ ఎండీ ఆదేశాల నేపథ్యంలో అనంతపురం జిల్లా వరకు తొలి దశలో 635 బస్సులను తిప్పాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీట్లను అరేంజ్ చేస్తున్నారు. బస్సుల్లో 50 శాతం మంది మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నారు. టికెట్లను కూడా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ బస్సులో సీట్లు ఖాళీగా ఉంటే బస్టాండ్ లో గూగుల్ పే, ఫోన్ పే, ఆన్ లైన్ ద్వారా కండక్టర్లు టికెట్లను బుక్ చేస్తారు.

  • Loading...

More Telugu News