Devineni Uma: అందుకే ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములని అమ్ముతున్నారు: దేవినేని ఉమ

devineni fires on ycp

  • విశాఖలో వైసీపీ దోచుకున్న భూములకు రేట్లు రావట్లేదు
  • సంపద సృష్టి చేతకాక భూముల అమ్మకం
  • భూములని అమ్మే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?
  • కోట్లుపెట్టి తెచ్చుకున్న మీ సలహాదారుల సలహాలు ఇవేనా?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఖాళీ భూముల విక్రయాలకు వైసీపీ సర్కారు సిద్ధమైన విషయం తెలిసిందే. విశాఖ, గుంటూరు నగరాల్లోని 9 చోట్ల భూములను అమ్మడానికి నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ)కి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ విషయంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.

'విశాఖలో మీరు దోచుకున్న వేలాది ఎకరాల భూములకు రేట్లు రావడం కోసం సంపద సృష్టి చేతకాక ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములని అమ్మే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? కోట్లు పెట్టి తెచ్చుకున్న మీ సలహాదారుల సలహాలు ఇవేనా? ఇది "బిల్డ్ ఏపీ"నా లేక "సెల్ ఏపీ"నా అని ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి జగన్ గారు' అని దేవినేని ఉమ నిలదీశారు.

'అధికార మదంతో సామాన్యులని బెదిరించి గుడివాడలో భూములు లాక్కొంటున్నారు. ప్రజలు ఫిర్యాదు చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదు. కరోనా సమయాల్లో కూడా మట్టి, పేకాట, ఇసుక, లిక్కర్ మాఫియాలు చెలరేగిపోతున్నాయి. బూతులు తిట్టే మంత్రిని కట్టడిచేసి, చర్యలు తీసుకునే దైర్యం మీకు ఉందా జగన్ గారూ' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News