cat: పిల్లుల ద్వారా ఇతర పిల్లులకు కరోనా వ్యాప్తి.. పరిశోధనలో వెల్లడి
- మనిషి నుంచి పిల్లులకు కరోనా
- పిల్లుల నుంచి మనుషులకు వస్తుందన్న ఆధారాలు మాత్రం లేవు
- మరిన్ని పరిశోధనలు చేయాలంటున్న అధ్యయనకారులు
కరోనా వైరస్ వ్యాధి సోకిన పిల్లుల నుంచి ఇతర పిల్లులకు కరోనా వ్యాపిస్తుందని అమెరికా పరిశోధకులు గుర్తించారు. కరోనా బారిన పడిన ఓ వ్యక్తికి సన్నిహితంగా ఉన్న మూడు పిల్లులను పరిశోధన కేంద్రంలో ఉంచి అమెరికాలోని విస్కన్ సన్ విశ్వ విద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేశారు.
ఆ పిల్లులకు దగ్గరగా మరికొన్ని పిల్లులను ఉంచారు. వాటి ముక్కునుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపారు. సన్నిహితంగా మెలిగిన ఇతర పిల్లుల్లో లక్షణాలు కనపడకపోయినప్పటికీ వాటికి కరోనా సోకిందని నిర్ధారించారు. అయితే, పిల్లుల నుంచి మనుషులకు కరోనా వైరస్ సోకుతుందా? అన్న విషయంపై మాత్రం ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని చెప్పారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. కరోనా సోకిన వ్యక్తుల నుంచి పిల్లులను దూరంగా ఉంచాలని సూచించారు.