Sensex: ఇన్వెస్టర్లకు భరోసా ఇవ్వలేని ప్యాకేజీ... భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex ends 885 points lower

  • అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 885 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 240 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. దేశ ఆర్థిక స్థితిని గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా ఇన్వెస్టర్లలో పూర్తి భరోసాను కల్పించలేకపోయింది. ఈ ప్యాకేజీ మన ఆర్థిక పరిస్థితిని ఎప్పటికి గట్టెక్కిస్తుందనే సందేహాలు ఇన్వెస్టర్లలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు అమ్మకాలకే మొగ్గుచూపడంతో... సూచీలు నష్టాల బాట పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 885 పాయింట్లు నష్టపోయి 31,122కి పడిపోయింది. నిఫ్టీ 240 పాయింట్లు కోల్పోయి 9,142కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హీరో మోటో కార్ప్ (2.45%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.65%), మారుతి సుజుకి (1.48%), ఎల్ అండ్ టీ (0.96%), సన్ ఫార్మా (0.78%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-5.24%), ఇన్ఫోసిస్ (-5.16%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-4.69%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.46%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-4.07%).

  • Loading...

More Telugu News