Gulabo Sitabo: లాక్ డౌన్ ఎఫెక్ట్: నేరుగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్న అమితాబ్ కొత్త చిత్రం

Amitab new movie Gulabo Sitabo will be releaed on Amazon Prime
  • షూజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన గులాబో సితాబో
  • లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా
  • అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతల నిర్ణయం
బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ నటించిన కొత్త చిత్రం గులాబో సితాబో. షూజిత్ సర్కార్ దర్శకత్వంలో ఓ విలక్షణ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంపై లాక్ డౌన్ ప్రభావం పడింది. కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నా, భారీగా జనసమూహాలు గుమికూడతాయన్న కారణంగా సినిమా హాళ్లకు ఇప్పట్లో అనుమతి వచ్చేలా లేదు. దాంతో, అమితాబ్ బచ్చన్ నటించిన గులాబో సితాబో చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.

వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజవ్వాల్సి ఉంది. అయితే వరుసగా లాక్ డౌన్ పొడిగిస్తూ ఉండడంతో చిత్ర నిర్మాతలు తాజా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాను జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్  ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ తో పాటు ఆయుష్మాన్ ఖురానా కూడా ముఖ్యపాత్ర పోషించాడు. రైజింగ్ సన్ ఫిలింస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రోనీ లాహిరి, షీల్ కుమార్ నిర్మించారు.
Gulabo Sitabo
Amazon Prime
Amitabh Bachchan
Shoojit Sarkar
Lockdown
Corona Virus

More Telugu News