Upasana: పొలంలో పేడ ఎత్తిన మెగా కోడలు ఉపాసన... ఫొటోలు ఇవిగో!

Mega daughter in law at farm house and poses with gobar
  • ఫార్మ్ హౌస్ లో ఉపాసన సందడి
  • ఆవు దూడలతో మమేకం
  • తనను తాను ఆధునిక తరం రైతుగా అభివర్ణన
మెగా కోడలు ఉపాసన కొణిదెల తాజాగా ఆసక్తికరమైన ఫొటోలు పంచుకున్నారు. తండ్రితో కలిసి తమ ఫార్మ్ హౌస్ లో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా ఆమె ఆవు పేడను ఎత్తి ఫొటోలకు పోజు ఇచ్చారు. కాసేపు ఆవు, దూడలతో మమేకం అవడమే కాదు, తనను తాను ఆధునిక తరం రైతుగా అభివర్ణించుకున్నారు. 'తండ్రితో పేడ అమ్మాయి' అంటూ సరదాగా ట్వీట్ చేశారు.

 "ఆర్గానిక్ (సేంద్రియ) వ్యవసాయం ఎలాగో నేర్చుకుంటున్నాను. ఎరువు తయారుచేయడం, ఆహార వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ఎలాగో తర్ఫీదు అందుకుంటున్నాను. రమణీయమైన సుస్థిర జీవనాన్ని ఆకళింపు చేసుకుంటున్నాను" అంటూ ఉపాసన ట్విట్టర్ లో స్పందించింది.
Upasana
Gobar
FarmHouse
Lockdown

More Telugu News