migrant workers: రైల్వే స్టేషన్ల నుంచి సొంతూళ్లకు బస్సులు.. కేంద్ర హోంశాఖ నిర్ణయం
- శ్రామిక్ రైళ్లలో సొంత రాష్ట్రాలకు వలస కూలీలు
- రైల్వే స్టేషన్ల నుంచి స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు
- అన్ని జాగ్రత్తలతో బస్సులు నడపాలంటూ ఉత్తర్వులు
లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులు శ్రామిక్ రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. అయితే, ఇక్కడే అసలు సమస్య ప్రారంభమవుతోంది. కార్మికులు ఆయా రాష్ట్రాలకు చేరుకుంటున్నప్పటికీ అక్కడి నుంచి సొంతూళ్లకు వెళ్లే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. వారి అవస్థలను గుర్తించిన కేంద్రం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చేందుకు రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. అయితే, తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.