Bandla Ganesh: టాలీవుడ్ లో కాక రేపుతున్న బండ్ల గణేశ్ ట్వీట్

Bandla Ganesh tweet rises temperature in Tollywood
  • తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు
  • తిన్నాక ఎంగిలి ఆకు అంటారు
  • అవసరం తీరాక లేని మాటలు అంటకడతారు
సినీ నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ లో కాక రేపోతోంది. 'తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకు వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక... లేని మాటలు అంటకడతారు' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ డైరెక్టర్ హరీష్ శంకర్ ను ఉద్దేశించే చేశారని చెప్పుకుంటున్నారు.

వివాదం లోతుల్లోకి వెళ్తే, 'గబ్బర్ సింగ్' సినిమా గొప్పదనాన్ని ప్రస్తావిస్తూ ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల ఓ లేఖను విడుదల చేశారు. అయితేే ఆ లేఖలో చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ పేరు మర్చిపోయారు. ఆ తర్వాత బండ్ల గణేశ్ పేరు మర్చిపోయానని మరో ట్వీట్ చేశారు. బ్లాక్ బస్టర్ నిర్మాత అంటూ బండ్లను ప్రశంసించారు. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు.

కానీ, హరీశ్ తీరుతో బండ్ల అప్పటికే హర్ట్ అయ్యారు. తన దైన శైలిలో కామెంట్ చేశారు. కష్టకాలంలో ఉన్న హరీశ్ కు తానే అవకాశం ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు తాజా వ్యాఖ్యలతో వివాదాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు.
Bandla Ganesh
Harish Shanker
Tollywood
Gabbar Singh Movie

More Telugu News