Kanakadurga temple: లాక్ డౌన్ నిబంధనలు మరింత సడలిస్తే విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం

Vijayawada Kanaka Durga temple going to allow devotees

  • ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
  • భక్తులు ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి
  • మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి.

ఏపీలో లాక్ డౌన్ నిబంధనలను మరింత సడలిస్తే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులను అనుమతిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘కరోనా’ వ్యాప్తి నివారణకు నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి.

ఇక అమ్మ వారిని దర్శించుకోవాలనే భక్తులు ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశారు. మార్గదర్శకాల్లో భాగంగా భక్తులకు అంతరాలయ దర్శనం, శఠగోపం పెట్టడం, తీర్థం ఇవ్వడం నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దర్శనానికి భక్తులను అనుమతించాలని అధికారులు యోచిస్తున్నారు.

  • Loading...

More Telugu News