Anasuya: నువ్వు ఎవడివిరా నా డ్రస్ గురించి మాట్లాడటానికి?: అనసూయ ఫైర్

Anchor Anasuya fires on netizen
  • నిన్న అనసూయ పుట్టినరోజు
  • అభిమానులతో లైవ్ లో మాట్లాడిన వైనం
  • అనసూయ డ్రెస్ గురించి కామెంట్ చేసిన నెటిజెన్
తెలుగు హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన పర్సనల్ లైఫ్ కు చెందిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ లో ముచ్చటిస్తూ సందడి చేస్తుంటారు.

తాజాగా నిన్న తన పుట్టినరోజు సందర్భంగా అనసూయ మంచి కార్యక్రమాలను చేపట్టారు. హైదరాబాద్ కీసర ప్రాంతంలో వంద మంది గర్భిణిలకు న్యూట్రిషన్స్ కిట్స్ అందించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ లో మాట్లాడారు.

ఈ లైవ్ లో ఒక కూల్ డ్రెస్ లో అనసూయ కనిపించింది. ఆమె మాట్లాడుతుండగా... ఒక నెటిజెన్ 'ఇద్దరు పిల్లల తల్లివి. ఆ డ్రస్ ఏంటి? పద్ధతిగా ఉండొచ్చు కదా?' అన్నాడు. దీంతో, సదరు నెటిజెన్ పై అనసూయ ఫైర్ అయ్యారు. 'నా డ్రెస్ గురించి మాట్లాడటానికి నువ్వెవడివిరా? అమ్మ అయితే ఏ డ్రెస్ వేసుకోవాలనే రూల్ ఏమైనా ఉందా? అమ్మతనం గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? నా పుట్టినరోజు నాడు తిట్లు తినాలనుకుంటున్నావా?' అంటూ మండిపడ్డారు.
Anasuya
Tollywood
Anchor
Birthday
Netizen
Social Media
Live

More Telugu News