David Warner: 'మైండ్ బ్లాక్' పాటకు డ్యాన్స్ చేయాలని కోరిన అభిమాని... ఆ పాట అందుబాటులో లేదన్న వార్నర్

Fan requests Warner for Mind Block song as the cricketer responded

  • తెలుగు పాటలు, డైలాగులపై వార్నర్ అభిమానం
  • టిక్ టాక్ వీడియోలతో అలరిస్తున్న వైనం
  • 'మైండ్ బ్లాక్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అభిమాని ట్వీట్

ఆస్ట్రేలియా డైనమిక్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఇటీవల తెలుగు పాటలు, డైలాగులపై విపరీతమైన మోజు ప్రదర్శిస్తున్నాడు. హిట్ సాంగ్స్, పాప్యులర్ తెలుగు డైలాగులతో టిక్ టాక్ వీడియోలు చేస్తూ అలరిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలోని 'మైండ్ బ్లాక్' పాటకు డ్యాన్స్ చేయాలంటూ వార్నర్ ను కోరాడు. 'మైండ్ బ్లాక్' పాటకు డ్యాన్స్ చేయాలని, ఆ వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు. దీనికి వార్నర్ స్పందించాడు. "హేయ్, ఈ పాటకు నేను డ్యాన్స్ చేయలేను. ఎందుకంటే ఈ పాటను ఆస్ట్రేలియాలో ఉపయోగించుకునే అవకాశం లేదు. ఈ పాటతో వీడియో చేసేందుకు అవకాశం లభిస్తే తప్పకుండా చేస్తాను" అంటూ ట్విట్టర్ లో బదులిచ్చాడు.

  • Loading...

More Telugu News