Donald Trump: పదేళ్ల తెలుగు బాలిక శ్రావ్య రెడ్డిని శ్వేతసౌధానికి ఆహ్వానించి సత్కరించిన డొనాల్డ్ ట్రంప్‌

 Sravya had sent personalised cards to healthcare workers across the United States

  • మేరీల్యాండ్‌ ఎల్క్‌రిడ్జ్‌లోని‌ ట్రూప్ 744లో బాలిక సేవలు
  • 100 బాక్స్‌ల గర్ల్స్‌ స్కౌట్స్‌‌ కుకీస్‌ను అమెరికా వైద్య సిబ్బందికి పంపిన బాలిక
  • హనోవర్‌లో ఉంటోన్న శ్రావ్య
  • తల్లిదండ్రులు భారతీయ సంస్కృతులను నేర్పుతూ పెంచారని వ్యాఖ్య

గర్ల్స్‌ స్కౌట్‌ సభ్యురాలు, తెలుగు బాలిక శ్రావ్య అన్నపరెడ్డి (10)ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సత్కరించారు. అమెరికాలో కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలకు మద్దతు తెలుపుతూ ఆమె అందించిన సేవలకు గానూ ట్రంప్ ఆమెను అభినందించారు. ఇటీవల అమెరికాలోని వైద్య సిబ్బంది సేవలను కొనియాడుతూ ఆమె వ్యక్తిగత కార్డులను పంపింది. శ్వేతసౌధంలో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రావ్యతో పాటు లైలా ఖాన్‌, లారెన్ మాట్నీ అనే మరో ఇద్దరు బాలికలనూ ఆయన సత్కరించారు.

కాగా, మేరీల్యాండ్,‌ ఎల్క్‌రిడ్జ్‌లోని‌ ట్రూప్ 744లో ఈ బాలికలు సేవలు అందిస్తున్నారు. వారు ఇటీవల 100 బాక్స్‌ల గర్ల్స్‌ స్కౌట్స్‌‌ కుకీస్‌ను స్థానిక అగ్నిమాపక, వైద్య సిబ్బందికి పంపారు. దీంతో శ్వేతసౌధానికి వారిని ఆహ్వానించి, ట్రంప్ అభినందనలు తెలిపారు.

కాగా, హనోవర్‌లో ఉంటోన్న తెలుగు బాలిక శ్రావ్య నాలుగో తరగతి‌ చదువుతోంది. తన తల్లిదండ్రులు తనకు భారతీయ సంస్కృతులను నేర్పుతూ పెంచారని తెలిపింది. తాను వసుధైక కుటుంబం సిద్ధాంతాన్ని నమ్ముతానని చెప్పింది. శ్రావ్య తండ్రి విజయ్‌రెడ్డి అన్నపరెడ్డి ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆయనది గుంటూరు‌ కాగా, శ్రావ్య తల్లి స్వస్థలం బాపట్ల సమీపంలోని నరసయ్య పాలెం.

  • Loading...

More Telugu News