ICMR: కరోనా పరీక్షల కోసం సరికొత్త విధానం ప్రకటించిన ఐసీఎంఆర్
- గత విధానాన్ని సవరించిన ఐసీఎంఆర్
- భారత్ లో పెరుగుతున్న కేసులకు అనుగుణంగా నూతన విధానం
- ఫ్లూ బాధితులకు విస్తృత పరీక్షలు చేయాలని సూచన
దేశంలో కరోనా కేసులు అంతకంతకు ఎక్కువవుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షల విధానాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సవరించింది. తాజాగా రూపొందించిన కరోనా వైద్య పరీక్షల విధానాన్ని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఈ క్రమంలో కరోనా పరీక్షలను మరిన్ని కేటగిరీలుగా విభజించింది.
ఈ క్రింది లక్షణాలు ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించింది.
- గత 14 రోజుల్లో అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన వారిలో ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలు ఉన్నవారు.
- కరోనా నిర్ధారణ అయిన వ్యక్తులను కలిసిన వారిలో ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలు కలిగిన వారు.
- కరోనాపై పోరాడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందిలో ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలతో బాధపడుతున్న వారు.
- తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు.
- కరోనా నిర్ధారణ అయిన వ్యక్తిని నేరుగా కలిసినా, కరోనా లక్షణాలు లేనివారు.
- హాట్ స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లలో ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలతో బాధపడుతున్నవారు.
- ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు.
- విదేశాల నుంచి వచ్చినవారు, వలస కార్మికుల్లో ఏడు రోజులుగా ఇన్ ఫ్లుయెంజా లక్షణాలతో బాధపడుతున్నవారు.