AP High Court: డాక్టర్ సుధాకర్‌ను కోర్టులో హాజరు పరచండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

AP High Court Issue Orders about Doctor Sudharka
  • హైకోర్టుకు లేఖ రాసిన టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత
  • సుమోటో పిల్‌గా స్వీకరించిన కోర్టు
  • పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశం
విశాఖపట్టణానికి చెందిన అనెస్తీషియా వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియో క్లిప్పింగును జతచేస్తూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను ఏపీ హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. దీనిని విచారించిన ధర్మాసనం డాక్టర్ సుధాకర్‌ను తమ ఎదుట హాజరు పరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.

ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ డాక్టర్ సుధాకర్ అంశాన్ని పార్టీలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని అన్నారు. హైకోర్టుకు అనిత పంపినది ఎడిట్ చేసిన వీడియో అని.. ప్రధానిని, ముఖ్యమంత్రిని సుధాకర్ దూషించిన వీడియోలను లేఖతో ఎందుకు జతచేయలేదని ప్రశ్నించారు.

ఈ కేసులో ఇప్పటికే ఓ కానిస్టేబుల్ సస్పెండ్ అయినట్టు వివరించారు. మరోవైపు, డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు అనుమానుషంగా ప్రవర్తించారని, అందుకు బాధ్యులైన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి సీహెచ్ వెంటకేశ్వర్లు హైకోర్టులో పిల్ వేశారు.
AP High Court
Doctor Sudhakar
TDP
vangalapudi anitha

More Telugu News