Donald Trump: కరోనా వ్యాప్తి నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వోకు ట్రంప్ మరో తీవ్ర హెచ్చరిక

trump write letter to who

  • వచ్చే 30 రోజుల్లో గణనీయమైన చర్యలు తీసుకోవాలి
  • లేదంటే నిధులను శాశ్వతంగా నిలిపేస్తాం
  • సంస్థ సభ్యత్వాన్ని కూడా వదులుకుంటాం 
  • చైనాకు డబ్ల్యూహెచ్‌వో తోలుబొమ్మ  

కరోనాపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు ఇప్పటికే నిధులు ఆపేసిన అమెరికా ఇప్పుడు మరో హెచ్చరిక చేసింది. తాజాగా డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసుస్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ కీలక లేఖ రాశారు.

వచ్చే 30 రోజుల్లో గణనీయమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే నిధులను శాశ్వతంగా నిలిపేస్తామని హెచ్చరించారు. అంతేకాదు, సంస్థ సభ్యత్వాన్ని కూడా తమ దేశం వదులుకుంటుందని తెలిపారు.

ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే విధంగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటనలు చేసిందని ట్రంప్ గుర్తు చేశారు. మనిషినుంచి మనిషికి కరోనా సోకదని చైనా పరిశోధనలో వెల్లడైనట్లు గతంలో డబ్ల్యూహెచ్‌వో ప్రకటిందని, అయితే, ఆ తర్వాత ప్రకటించిన నివేదిక మరోలా ఉందని ఆయన పేర్కొన్నారు.

కరోనా గురించి మాట్లాడిన వైద్యులపై దాడులు జరుగుతున్నప్పటికీ చైనా పారదర్శకంగానే వ్యవహరిస్తోందంటూ డబ్ల్యూహెచ్‌వో వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అంతకు ముందు శ్వేతసౌధంలో మాట్లాడిన ట్రంప్.. డబ్ల్యూహెచ్‌వో చైనాకు తోలుబొమ్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News