Corona Virus: కరోనా తర్వాత సినీ పరిశ్రమ ఎలా ఉంటుందో చెప్పిన 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ
- ఆడియో, ప్రీరిలీజ్ ఫంక్షన్లు ఉండవు
- మాల్స్, థియేటర్లకు వెళ్లడం ఉండదు
- అంతా ఆన్ లైన్ ద్వారానే జరుగుతుంది
కరోనా వైరస్ దెబ్బకు సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కోవిడ్ ప్రభావం తగ్గితే కాని మళ్లీ కార్యక్రమాలు మొదలయ్యే పరిస్థితి లేదు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉండబోతోందనే సందేహాలు అందరిలో ఉన్నాయి. దీనిపై ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కరోనా తర్వాత సినీ పరిశ్రమ గతంలో మాదిరి ఉండబోదని 'బాహుబలి' నిర్మాత శోభు చెప్పారు. ఆడియో లాంచ్ కార్యక్రమాలు, ప్రీరిలీజ్ ఫంక్షన్స్ వంటివి ఉండవని తెలిపారు. ప్రమోషన్ల కోసం రోడ్ ట్రిప్ లు, మాల్స్ కు వెళ్లడం, థియేటర్స్ కు వెళ్లడం వంటివి ఉండవని అన్నారు. అంతా ఆన్ లైన్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే జరుగుతుందని చెప్పారు.
మరోవైపు, శోభు యార్లగడ్డ నిర్మించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 17నే ఇది ప్రేక్షకుల ముందుకు రావాల్సి వున్నప్పటికీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.