Lockdown: జూన్ 1 నుంచి దేశ వ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్ల పరుగులు!
- జూన్ 1 నుంచి 200 రైళ్లు తిరుగుతాయి
- త్వరలోనే రిజర్వేషన్లు ప్రారంభం
- ట్విట్టర్ లో వెల్లడించిన రైల్వే మంత్రి పీయుష్ గోయల్
జూన్ ఒకటి నుంచి రైళ్లను నడపడానికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ మేరకు రైల్వే మంత్రి పీయుష్ గోయల్ ఓ ట్వీట్ చేశారు. జూన్ 1 నుంచి దేశమంతటా నిత్యమూ 200 నాన్ ఏసీ రైళ్లను టైమ్ టేబుల్ ప్రకారం నడిపించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. ఈ రైళ్లకు త్వరలోనే ఆన్ లైన్ రిజర్వేషన్ అందుబాటులోకి వస్తుందని కూడా అన్నారు.
పీయుష్ గోయల్ ట్వీట్ ను చూసిన వారంతా ఈ నెల 31 తరువాత లాక్ డౌన్ ఇక దాదాపుగా తొలగిపోయినట్టేనని అంటున్నారు. కాగా, లాక్ డౌన్ సమయంలో కొన్ని ప్రత్యేక రైళ్లను, వలస కూలీలను తరలించే రైళ్లను నడిపిన సంగతి తెలిసిందే.