Simhachalam: సింహాచలం ఆలయంలో సర్పం... చాకచక్యంగా పట్టేసిన పూజారి.. వీడియో ఇదిగో!
- ఆలయంలోకి ప్రవేశించిన పాము
- చాకచక్యంగా పట్టేసిన సీతారామాచార్యులు
- వైరల్ అవుతున్న వీడియో
సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి ఓ భారీ పాము రాగా, దాన్ని ఆలయ ఉప ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు ఒడుపుగా పట్టేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయంలోకి పాములు తరచూ వస్తూనే ఉంటాయి. వాటిని చూడగానే అందరూ పారిపోతారు. కానీ సీతారామాచార్యులు, వాటితో చాకచక్యంగా వ్యవహరిస్తారు. వాటిని పట్టుకుని దూరంగా ఉన్న తోటల్లోకి వదిలేస్తారు. గతంలోనూ ఆయన ఎన్నో పాములను ఇలాగే పట్టి, విడిచిపెట్టారు.
ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా, ఆలయంలోకి సాధారణ భక్తులకు ఎవరికీ ప్రవేశాన్ని కల్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే దాదాపు 9 అడుగులకు పైగా పొడవున్న పాము ఒకటి ఆలయంలోకి ప్రవేశించింది. విషయం తెలుసుకున్న ఆలయ ఉద్యోగులు, దాన్ని సమీపించేందుకు కూడా భయపడ్డారు. సీతారామాచార్యులు దాన్ని పట్టిన వీడియోను మీరు కూడా చూడవచ్చు.