Donald Trump: చైనాలో కరోనా వూహాన్ దాటలేదు.. మరి ఇతర దేశాలకు ఎలా చేరింది?: చైనాపై ట్రంప్ మరోసారి ఆగ్రహం
- చైనా వ్యవహరించిన తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది
- ఇతర ప్రాంతాలకు వ్యాపించే వరకు చైనా ఏం చేసింది
- చైనాతో 3 నెలల క్రితం చేసుకున్న ఒప్పందంపై అభిప్రాయం మారింది
కరోనా విజృంభణ నేపథ్యంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. చైనా వ్యవహరించిన తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోందని తెలిపారు. చైనాతో మూడు నెలల క్రితం కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ఇప్పుడు తన అభిప్రాయం భిన్నంగా ఉందని చెప్పారు. కరోనా ఇతర ప్రాంతాలకు వ్యాపించే వరకు చైనా ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.
వుహాన్ దాటకుండా కరోనాను నిలువరించగలిగిన చైనా అమెరికాతో ఇతర దేశాలకు పాకకుండా మాత్రం ఎందుకు ఆపలేకపోయిందని ఆయన నిలదీశారు. ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. చైనాలోని ఇతర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి జరగలేదని ఆయన గుర్తు చేశారు.
కాగా, కరోనా సంక్షోభం ముగిసిన అనంతరం చైనాతో వ్యవహరించే తీరు కఠినంగా ఉండాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులు తమ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారన్నారు. కరోనా సమాచారాన్ని దాచి పెట్టి ప్రపంచ దేశాలపైకి ఆ వైరస్ను పంపిందని అంటున్నారు. దీంతో అమెరికాలో భారీగా ప్రాణ నష్టం సంభవించిందని చెబుతున్నారు. మొట్టమొదటి వైరస్ సోకిన వ్యక్తి ఎవరో కూడా తెలియదని చెప్పారు.