Pawan Kalyan: ఈ విపత్కర సమయంలో పురోహితులకు నెలకు రూ.5 వేలు ఇవ్వాలి: పవన్ కల్యాణ్ డిమాండ్
- పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి
- ఎదుర్కొంటున్న కష్టాలను బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తెలిపింది
- బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను సక్రమంగా వినియోగించాలి
ఏపీలో పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను సక్రమంగా వినియోగించాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పౌరోహిత్యంపై ఆధారపడ్డవారు ఎదుర్కొంటున్న కష్టాలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సవివరంగా తెలియజేసిందని ఆయన తెలిపారు. కరోనా విపత్కర సమయంలో పురోహితులకు నెలకు రూ.5 వేలు, నిత్యావసర సరుకులు అందించాలని ఆయన కోరారు.