Amphan: ఎంఫాన్ తుపాను ధాటికి కోల్‌కతా విమానాశ్రయంలోకి భారీగా నీళ్లు.. వీడియో ఇదిగో

 West Bengal A portion of Kolkata Airport flooded in wake of Cyclone Amphan

  • బలమైన ఈదురు గాలులు
  • ఎయిర్‌పోర్టులో పలు నిర్మాణాలు విరిగిపడిన వైనం
  • పలు విమానాలకు కూడా నష్టం

ఎంఫాన్‌ తుపాను ధాటికి  కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమయింది. బలమైన ఈదురు గాలులు కూడా రావడంతో ఎయిర్‌పోర్టులో పలు నిర్మాణాలు విరిగిపడి కనిపించాయి. అంతేగాక, పలు విమానాలకు కూడా నష్టం వాటిల్లింది. తుపాను నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో కార్గో సేవలను కూడా తాత్కాలికంగా నిలిపేశారు. తుపాన్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12కి చేరింది.

వేలాది ఇళ్లలోకి నీళ్లు చేరాయి. అతి తీవ్ర తుపాను ఎంఫాన్‌ వల్ల కోల్‌కతాలో బంద్ వాతావరణం కొనసాగుతోంది. తుపాను తీరం దాటాక కోల్‌కతా వైపున పయనించడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు కూలాయి. విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకూలడంతో ఆయా సేవలకు అంతరాయం కలుగుతోంది.

  • Loading...

More Telugu News