Ranganayakamma: సీఐడీ విచారణలో ఇదే చెపుతాను: రంగనాయకమ్మ

I have not done anything wrong says Ranganayakamma
  • ఎల్జీ ప్రమాదంలో జరిగిందే పోస్ట్ చేశా
  • తప్పు చేశానని భావించడం లేదు
  • ఇలాంటి పోస్టులు పెట్టడం తప్పని నాకు తెలియదు
ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారనే ఆరోపణలతో 60 ఏళ్ల వృద్ధురాలు రంగనాయకమ్మకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐడీ కార్యాలయంలో విచారణకు ఈరోజు రంగనాయకమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగనాయకమ్మతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితర నేతలు కూడా సీఐడీ కార్యాలయానికి వచ్చారు.

ఈ సందర్భంగా  మీడియాతో రంగనాయకమ్మ మాట్లాడుతూ, ఎల్జీ ప్రమాదంలో ఏం జరిగిందో అదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టానని చెప్పారు. తాను తప్పు చేశానని భావించడం లేదని తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టడం తప్పు అని కూడా తనకు తెలియదని చెప్పారు. సీఐడీ అధికారులకు తాను ఇదే విషయాన్ని చెబుతానని అన్నారు.
Ranganayakamma
LG Polymers
Social Media
CID

More Telugu News