Ayodhya Ram Mandir: ఆయోధ్య రామజన్మభూమి వద్ద బయటపడిన శివలింగం
- అయోధ్యలో నిర్మాణ పనులు
- శివలింగంతో పాటు దేవతా మూర్తుల విగ్రహాలు లభ్యం
- ఐదు అడుగుల ఎత్తున్న శివలింగం
దశాబ్దాల తరబడి నలిగిన అయోధ్య రామజన్మభూమి వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో సమసిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అయోధ్యలోని రామజన్మభూమి వద్ద నిర్మాణ పనులు జరుగుతుండగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అక్కడో శివలింగం లభ్యమైంది. ఈ శివలింగం ఎత్తు ఐదు అడుగులు ఉన్నట్టు గుర్తించారు.
రామజన్మభూమిలో గత కొన్నిరోజులుగా భూమి చదును చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడి శిథిలాలను తొలగిస్తుండగా, శివలింగంతో పాటు 7 నల్లరాతి స్తంభాలు, 6 ఎర్రరాతి స్తంభాలు, ఓ కలశం, విరిగిపోయిన స్థితిలో మరికొన్ని దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. ఇటీవలే అక్కడ పూర్ణకుంభం కూడా బయల్పడిందని వీహెచ్ పీ నేత వినోద్ భన్సల్ తెలిపారు.