CID: ఆ పోస్టులు పెట్టడానికి రంగనాయకమ్మ సరైన కారణాలు చెప్పలేకపోయారు!: ఏపీ సీఐడీ

CID issues statement over Ranganayakamma social media post

  • సోషల్ మీడియాలో పోస్టు నేపథ్యంలో రంగనాయకమ్మపై కేసు
  • నోటీసులు జారీ చేసిన సీఐడీ
  • ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు చేస్తున్నారని సీఐడీ వెల్లడి

ఇటీవల ఏపీలో రంగనాయకమ్మ అనే పేరు బాగా వినిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేశారంటూ సీఐడీ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆమెకు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం సీఐడీ దీనిపై ఓ ప్రకటన చేసింది.

ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి 50 శాతం జీతాలు తగ్గించారంటూ రంగనాయకమ్మ పోస్టు చేశారని సీఐడీ వెల్లడించింది. ఆమె ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం గురించే కాక అనేక పోస్టులు చేశారని ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ పోస్టులు చేస్తున్నారని వివరించింది. నేడు జరిపిన విచారణలో తనను తాను సోషల్ మీడియా ఉద్యమకారిణిగా ఆమె పేర్కొన్నారని సీఐడీ తెలిపింది. కానీ, ఆ పోస్టులు పెట్టడానికి సరైన కారణాలు చెప్పలేకపోయారని పేర్కొంది.

  • Loading...

More Telugu News