Narendra Modi: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మోదీకి స్వాగతం పలికిన మమతా బెనర్జీ.. వీడియో ఇదిగో

PM Narendra Modi received by West Bengal CM Mamata Banerjee

  • ఎంఫాన్ పెను తుపాను పరిస్థితులను సమీక్షించనున్న మోదీ
  • పశ్చిమ బెంగాల్ తో పాటు ఒడిశాలో మోదీ ఏరియల్ సర్వే
  • సహాయక చర్యలపై చర్చలు

ఎంఫాన్ పెను తుపాను పశ్చిమ బెంగాల్ లో బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్‌కతా చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జగదీప్ ధన్‌కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు.

పశ్చిమ బెంగాల్ తో పాటు ఒడిశాలో మోదీ ఏరియల్ సర్వే చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోను, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తోనూ విడివిడిగా మోదీ మాట్లాడతారు. సహాయక చర్యలపై చర్చిస్తారు. కాగా, తుపాను మృతుల సంఖ్య 80కి చేరిందని మమతా బెనర్జీ ప్రకటించారు. పెనుతుపానుతో పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.

  • Loading...

More Telugu News