APSRTC: 7,600 మంది ఏపీఎస్ ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురు!

APSRTC outsourcing Employees to get 90 percent Salary

  • ఏప్రిల్ నెల వేతనం చెల్లింపునకు ఎండీ గ్రీన్ సిగ్నల్
  • వేతనం మొత్తంలో 90 శాతం చెల్లింపు 
  • జర్నలిస్టుల రాయితీ కొనసాగింపు

కరోనా వైరస్ కారణంగా దాదాపు రెండు నెలలపాటు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఫలితంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు చెల్లించలేదు. అయితే, రెండు రోజుల క్రితం బస్సులు మళ్లీ రోడ్డెక్కిన నేపథ్యంలో ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 7,600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు చెల్లించాలంటూ ఆ సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అధికారులను ఆదేశించారు. అయితే, వేతనం మొత్తంలో 90 శాతం మాత్రమే చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎండీ నిర్ణయంపై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఇదిలావుంచితే, బస్సుల్లో ఇస్తున్న రాయితీలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు బస్సు సేవల పునరుద్ధరణ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ విషయంలో కొన్ని సడలింపులు ఇస్తూ జర్నలిస్టుల రాయితీని కొనసాగిస్తున్నట్టు ఎండీ ఆదేశాలు జారీ చేశారు. అయితే, వృద్ధులు, విద్యార్థులు, దివ్యాంగులు సహా ఇతరులకు కల్పించే రాయితీలు ప్రస్తుతానికి వర్తించవని ఎండీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News