Whatsapp: ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకునేందుకు వాట్సాప్ లో నయా ఫీచర్

Whatsapp introduced new feature to save contacts using a qr code
  • కొత్తగా క్యూఆర్ కోడ్ స్కాన్ ఫీచర్
  • నెంబర్లు ఫీడ్ చేసే శ్రమ తగ్గించేందుకు వాట్సాప్ ప్రయత్నం
  • ప్రస్తుతం బీటా వెర్షన్ విడుదల!
సోషల్ మెసేజింగ్ లో ఎన్ని యాప్ లు వస్తున్నా వాట్సాప్ కున్న ప్రజాదరణ దేనికీ లేదు. యూజర్ల అవసరాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు అప్ డేట్ లతో వాట్సాప్ నిత్యనూతనంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. తాజాగా వినియోగదారుల సౌకర్యార్థం మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకోవాలంటే కేవలం ఓ క్యూర్ కోడ్ ను స్కాన్ చేస్తే సరిపోతుంది. వారి నెంబరు, పేరు సహా  కాంటాక్టుల జాబితాలో నిక్షిప్తం అవుతాయి.

ఇప్పటివరకు, కాంటాక్టు లిస్టుకు నెంబర్లు ఫీడ్ చేయాలంటే, కీప్యాడ్ ఓపెన్ చేసి నెంబరు టైప్ చేసి, పేరు టైప్ చేసి ఆపై సేవ్ చేయాలి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఫోన్ నెంబర్లు తప్పుగా టైప్ చేయడమో, లేక పేర్లు తప్పుగా టైప్ చేయడమో జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో, భారీ సంఖ్యలో ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకోవాలంటే అది ఎంత శ్రమభరితమో ఆలోచించుకోండి. ఇకపై అలాంటి కష్టాలకు చెక్ పెడుతూ ఈ వాట్సాప్ సరికొత్త ఫీచర్ తో యూజర్ల పని ఎంతో సులువు కానుంది.

సెట్టింగ్స్ లో కొత్తగా క్యూఆర్ కోడ్ ఆప్షన్ రానుంది.ప్రతి వాట్సాప్ వినియోగదారుడికి ఓ క్యూర్ కోడ్ కేటాయిస్తారు. ఓ వ్యక్తి ఫోన్ నెంబరు సేవ్ చేసుకోవాలంటే ఆ వ్యక్తి ఫోన్ లోని క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ తో స్కాన్ చేస్తే సరి. అతడి పేరు, నెంబరు ఆటోమేటిగ్గా సేవ్ అవుతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో ఉంది. మరికొన్ని మార్పులు చేర్పులతో త్వరలోనే యూజర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
Whatsapp
QR Code
Phone Numbers
Save
Contact List

More Telugu News