Ramzan: రేపు రంజాన్... ప్రకటించిన ఢిల్లీ జామా మసీదు!
- శనివారం నాడు కనిపించని నెలవంక
- ఆదివారంతో ఉపవాసాల ముగింపు
- ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని పిలుపు
దేశవ్యాప్తంగా ముస్లింలు సోమవారం నాడు రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవాలని న్యూఢిల్లీలోని జామా మసీదు ప్రకటించింది. శనివారం నాడు దేశంలో ఎక్కడా నెలవంక కనిపించలేదని స్పష్టం చేసిన జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మదా షా బుకారీ, ఆదివారం రాత్రితో రంజాన్ మాసం పూర్తయినట్టని, సోమవారం పండగ చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ లోని రుహియత్ ఇలాల్ కమిటీ అధ్యక్షుడు అజీముద్దీన్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. కాగా, లాక్ డౌన్ కొనసాగుతున్నందున ముస్లింలంతా ఇళ్లలోనే ఉండి, ప్రార్థనలు చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని మత పెద్దలు సూచిస్తున్నారు.