Locusts: ఉత్తరప్రదేశ్ దిశగా దూసుకువస్తున్న రాకాసి మిడతల దండు... అప్రమత్తమైన అధికారులు!

Locusts to reach Uttar Pradesh

  • పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న మిడతలు
  • రాజస్థాన్ చేరుకున్న మిడతల దండు
  • యూపీలో 17 జిల్లాలు ప్రభావితమవుతాయని అంచనా

పాకిస్థాన్ వైపు నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల దండు ఉత్తరప్రదేశ్ దిశగా దూసుకు వస్తున్నట్టు అంచనా వేశారు. ప్రస్తుతం రాజస్థాన్ లోని దౌసా జిల్లా వరకు చేరుకున్న ఈ రాకాసి మిడతలు ఆగ్రా సహా యూపీలో 17 జిల్లాలపై పెను ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. దాంతో, 204 ట్రాక్టర్లను సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటి ద్వారా మిడతలపై రసాయనాలు పిచికారీ చేయాలని నిర్ణయించింది.

కాగా, రెండ్రోజుల క్రితమే రాజస్థాన్ చేరుకున్న ఈ మిడతల గుంపు గాలి వ్యతిరేక దిశలో వీస్తుండడంతో చెల్లాచెదురయ్యాయి. దాంతో కొన్ని మధ్యప్రదేశ్ దిశగా వెళ్లాయి. అయితే, మరికొన్నిరోజుల్లో రాకాసి మిడతల ప్రభావం యూపీపై పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మిడతలు ఒక్కసారి పంట పొలంపై వాలాయంటే అక్కడ చూడ్డానికి ఏమీ మిగలదు. తమ పదునైన దవడలు, కాళ్లకు ఉన్న నిర్మాణాలతో ముక్కలు ముక్కలుగా కత్తిరించి వేస్తాయి. ఇవి ఎక్కువగా ఆఫ్రికా ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి.

  • Loading...

More Telugu News