sai dharam tej: సాయితేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' నుంచి 'నో పెళ్లి' సాంగ్‌ విడుదల.. పాటలో రానా, వరుణ్ తేజ్

Sai dharam tej Enjoy the first song

  • విడుదల చేసిన నితిన్
  • 'ఎన్ని రోజులు ఇలాగే సింగిల్‌గా ఉంటావో చూస్తా'నంటూ వ్యాఖ్య
  • అలరిస్తోన్న పాట

'ప్రతిరోజూ పండగే' సినిమాతో అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో సాయితేజ్ ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని 'నో పెళ్లి' సాంగ్‌ను ఆ సినీ బృందం విడుదల చేసింది. ఈ పాటలో రానా, వరుణ్ తేజ్‌ కూడా ఓ చోట కనిపిస్తారు.

               
ఈ సినిమాలో సాయి తేజ్ సరనన నభా నటేశ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సుబ్బు దర్శకత్వంలో, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చిన ఈ పాటను హీరో నితిన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశారు. ఈ పాట చాలా బాగుందని ఆయన కితాబునిచ్చాడు.

'ఎన్ని రోజులు ఇలాగే సింగిల్‌గా ఉంటావో చూస్తా.. కొన్ని సార్లు చేసుకోవ‌డంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో కాని చేసుకోవ‌డం ప‌క్కా' అంటూ కామెంట్ చేశాడు. ఈ పాటను పెళ్లికాని వారందరికీ అంకితమిస్తున్నట్లు సాయితేజ్ పేర్కొన్నాడు.
               

  • Loading...

More Telugu News