Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో కనిపించిన అరుదైన దేవాంగ పిల్లులు
- గుర్తించి అధికారులకు సమాచారం అందించిన నిర్మాణ కార్మికులు
- అరుదైన దేవాంగ పిల్లులుగా గుర్తించిన అధికారులు
- శేషాచలం అటవీ ప్రాంతంలో నివాసం
తిరుమల ఘాట్ రోడ్డులో నిన్న అరుదైన రెండు పిల్లులు కనిపించాయి. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు వాటిని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. తిరుమల రెండో ఘాట్ రోడ్డు చివరి మలుపు సమీపంలో కనిపించిన ఈ రెండు పిల్లులను దేవాంగ పిల్లులుగా అధికారులు గుర్తించారు. కార్మికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వాటిని అక్కడే ఉంచారు. అరుదైన జాతికి చెందిన ఈ దేవాంగ పిల్లులు శేషాచలం అటవీప్రాంతంలో నివసిస్తున్నట్టు అధికారులు తెలిపారు.