Supreme Court: వలస కార్మికుల అంశంపై కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం నోటీసులు

Supreme Court issues notices over migrants problems
  • లాక్ డౌన్ తో దుర్భరంగా మారిన వలస జీవుల పరిస్థితి
  • సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం
  • వలసకూలీల కోసం తీసుకున్న చర్యలేంటో తెలపాలని ఆదేశం
లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.

వలస కూలీల కష్టాలు తీర్చడానికి తీసుకున్న చర్యలేంటో తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా, వలస కూలీల ప్రయాణాలు, ఆశ్రయం, ఆహారం అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Supreme Court
Migrants
Notices
Center
States
UT
Lockdown
Corona Virus

More Telugu News