China: చైనాకు సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్న భారత్.. సరిహద్దులకు భారీ ఎత్తున బలగాల తరలింపు!
- సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తున్న చైనా
- భారీగా బలగాలను మోహరిస్తున్న భారత్
- ఆర్మీ కమాండర్లతో భేటీ అయిన ఆర్మీ చీఫ్ నరవాణే
ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో చైనా అలజడిని రేపింది. ఓ వైపు నేపాల్ ను ఎగదోస్తూ, మరోవైపు సరిహద్దులో సైన్యాన్ని భారీగా మోహరిస్తోంది. యుద్ధ అవసరాలకు తగ్గట్టుగా రోజుల వ్యవధిలోనే సరిహద్దుకు సమీపంలో ఉన్న ఓ ఎయిర్ బేస్ ను విస్తరించింది.
ఈ నేపథ్యంలో, చైనాకు గట్టిగా జవాబిచ్చేందుకు భారత్ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. సరిహద్దుల వెంబడి భద్రతా బలగాలను మోహరించింది. సున్నిత ప్రదేశాల్లో అదనపు బలగాలను కూడా మోహరింపజేసింది. మరిన్ని బలగాలను సరిహద్దులకు పంపుతోంది.
చైనాతో సరిహద్దు సమస్య ముదురుతున్న సమయంలో... ఇండియన్ ఆర్మీ కమాండర్లతో ఆర్మీ చీఫ్ నరవాణే భేటీ అయ్యారు. పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీ ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో పాటు త్రివిధ దళాధిపతులతో సమీక్ష నిర్వహించారు.