Corona Virus: వీధిబాట పట్టనున్న రెస్టారెంట్లు.. ప్రముఖ కంపెనీల ప్లాన్!

restaurants in streets

  • కోట్లాది రూపాయల బిజినెస్‌ జరిగే రెస్టారెంట్లు కరోనా దెబ్బకు కుదేలు
  • మాల్స్‌లో కరోనా వ్యాప్తి అధికంగా జరిగే అవకాశాలు
  • అక్కడ అద్దె చాలా‌ ఎక్కువ
  • వీధుల్లో పెట్టాలని మెక్‌డొనాల్డ్స్‌, డిగస్టీబస్‌, లైట్‌ బైట్‌ ఫుడ్స్ యోచన

కోట్లాది రూపాయల బిజినెస్‌ జరిగే రెస్టారెంట్లు కరోనా దెబ్బకు కుదేలైపోయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో మాల్స్‌కు సడలింపులు కూడా దక్కట్లేదు. దీంతో ప్రముఖ రెస్టారెంట్లు భారీగా నష్టపోతున్నాయి. మాల్స్‌లో కరోనా వ్యాప్తి అధికంగా జరిగే అవకాశాలు ఉండడంతో వాటిని తెరిచేందుకు ఇప్పట్లో మార్గం సుగమం అయ్యే అవకాశం లేదు.

భవిష్యత్తులో మాల్స్‌ను తిరిగి తెరిచినప్పటికీ నిబంధనలు, నియంత్రణలు ఉండనున్నాయి. దీంతో రెస్టారెంట్లకు నష్టాలు వచ్చే పరిస్థితులు లేకపోలేదు. పైగా, మాల్స్‌లో ఈ ఫుడ్‌కోర్టులకు అద్దె చాలా‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో వీధుల్లో ప్రత్యేక ప్రాంతాల్లోకి రెస్టారెంట్లను మార్చాలని యజమానులు భావిస్తున్నారు. మెక్‌డొనాల్డ్స్‌, డిగస్టీబస్‌, లైట్‌ బైట్‌ ఫుడ్స్‌ ఈ విషయంపైనే సమాలోచనలు చేస్తున్నాయని తెలిసింది. వీధుల్లో అతి తక్కువ ఖర్చుతో రెస్టారెంట్లను కొనసాగించవచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News