Neelam Sahni: హైకోర్టుకు హాజరైన ఏపీ చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్ని
- కార్యాలయాలకు వైసీపీ రంగుల విషయంలో కోర్టుకు హాజరైన సీఎస్
- ఈ అంశాన్ని కోర్టు ధిక్కరణగా భావిస్తున్న హైకోర్టు
- తదుపరి విచారణ రేపటికి వాయిదా
ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు వేసిన అంశాన్ని ఏపీ హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. రంగులు తొలగించాలంటూ గతంలోనే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, వైసీపీ రంగులకు తోడు మట్టి రంగును ప్రభుత్వం కలిపింది. ఈ అంశంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ లను కోర్టుకు రమ్మని పిలిచింది. దీంతో, వీరిద్దరూ ఈరోజు హైకోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వం తరపు వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఓ కేసు విచారణకు సంబంధించి ఏపీ డీజీపీ కూడా ఇటీవల హైకోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే.